Advertisement
Advertisement
Abn logo
Advertisement

ద్విచక్ర వాహనం కాలువలో పడి ఒకరి మృతి

 కలకడ, డిసెంబరు 3: మండలంలోని కదిరాయచెరువు -కోన వెళ్లే మార్గంలోని హంద్రీ -నీవా కాలువ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. హెచ్‌సీ రమేష్‌ కథనం మేరకు.. రొంపిచెర్ల మండలం దద్దాలవారిపల్లెకు చెందిన ప్రశాంత్‌ (27) గురువారం రాత్రి కలికిరిలోని తన పెదనాన్న ఇంటికి వెళ్లాడు. తన భార్య గుర్రంకొండ మండలం సంగసముద్రం పంచాయతీ మామిళ్లవారిపల్లెలో పుట్టింటిలో ఉండడంతో అక్కడి బయలుదేరాడు. మార్గమధ్యంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో హంద్రీ-నీవా కాలువలో పడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. భార్య జైనాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement