ఇన్‌స్టాగ్రామ్‌లో క్లాస్‌మేట్‌కు వేధింపులు

ABN , First Publish Date - 2021-06-17T13:45:54+05:30 IST

ఇన్‌స్టాగ్రామ్‌లో క్లాస్‌మేట్‌ను వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో క్లాస్‌మేట్‌కు వేధింపులు

హైదరాబాద్‌ సిటీ : ఇన్‌స్టాగ్రామ్‌లో క్లాస్‌మేట్‌ను వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్‌కేపురం స్నేహపురి కాలనీకి చెందిన లేబూరి వేదసాయిరెడ్డికి ఇంటర్‌లో ఓ యువతితో స్నేహం ఏర్పడింది. డిగ్రీలో కూడా స్నేహాన్ని కొనసాగించారు. కొంతకాలంగా ఆ యువతి సాయిరెడ్డిని దూరం పెడుతోంది. ఆమె ఇతరులతో స్నేహంగా ఉండటంతో కక్ష పెంచుకున్నాడు. యువతి పరువు తీయాలని నిర్ణయించుకుని నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ సృష్టించాడు. అందులో అసభ్యకర మెసేజ్‌లు, అభ్యంతకర చిత్రాలను పోస్ట్‌ చేస్తున్నాడు. వాటిని ఆమె స్నేహితులకు పంపిస్తూ వేధిస్తున్నాడు. అతడి వేధింపులను భరించలేక యువతి రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్టు చేశారు.

Updated Date - 2021-06-17T13:45:54+05:30 IST