Abn logo
Sep 26 2021 @ 09:42AM

అలిగిన భార్యను ఇంటికి తెచ్చేందుకు అత్తారింటికి అల్లుడు...ఉదయానికి శవమై కనిపించాడు... అసలు విషయం చెప్పిన మృతుని సోదరుడు!

హిసార్: భార్యాభర్తల మధ్య గొడవలనేవి సహజం. అయితే అవి మరింత ముదరకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ భార్యాభర్తలపైనే ఉంటుంది. హరియాణాలోని హిసార్‌లో ఒక జంటమధ్య చోటుచేసుకున్న వివాదం విపరీత పరిణామాలకు దారితీసింది. హిసార్‌లోని ఆజాద్ నగర్ ప్రాంతంలో ఒక యువకుని మృతదేహం వేపచెట్టుకు వేలాడుతూ కనిపించింది. మృతుడిని ఖర్బలా గ్రామానికి చెందిన ట్రక్కు డ్రైవర్ మొహమ్మద్ షరీఫ్ ఖాన్(38)గా గుర్తించారు. 

మృతుడు ఖరీఫ్ ఖాన్ తన భార్య జరీనాను, కుమారుణ్ణి కలుసుకునేందుకు వచ్చాడు. మృతుని సోదరుడు బషీర్ ఖాన్ మాట్లాడుతూ తన అన్నను అత్తారింటివారు కొట్టి చంపేశారని, తరువాత ఉరితాడుకు వేలాడదీశారని ఆరోపించాడు. ఈ ఉదంతంలో మృతుని భార్య జరీనాతో పాటు అత్తామామలపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. మృతుని శరీరంపై తీవ్రమైన గాయాలను పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా బషీర్ ఖాన్ మాట్లాడుతూ తన సోదరుడు మొహమ్మద్ షరీఫ్ ఖాన్‌కు 11 ఏళ్ల క్రితం రవీనాతో వివాహమయ్యిందని తెలిపారు.

అదిమొదలు తన సోదరుణ్ణి అతని భార్య, అత్తామామలు ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నారన్నారు. ఈ నేపధ్యంలో రెండేళ్ల క్రితం జరీనా అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందన్నారు. అప్పటి నుంచి తన సోదరుడు.. భార్యను, కుమారుణ్ణి ఇంటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇదేవిధంగా తన సోదరుడు అత్తారింటికి వెళ్లగా, అక్కడున్నవారంతా మూకుమ్మడిగా తన అన్నపై దాడి చేసి చంపేసి, చెట్టుకు వేలాడదీశారన్నారు. అయితే తనకు పోలీసుల నుంచి ఫోన్ వచ్చాకే ఈ విషయం తెలిసిందన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షరీఫ్ ఖాన్ మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరిలించి, దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...