Abn logo
Jun 10 2021 @ 11:08AM

బ్లాక్‌లో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్‌ను విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్

హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో బ్లాక్‌లో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్‌ను విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సరూర్‌నగర్‌లో ఇంజక్షన్లు‌ విక్రయిస్తుండగా ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కూకట్‌పల్లి ప్రగతి నగర్‌కు చెందిన గంగోళ్ల మనీష్ (23).. సరూర్‌నగర్‌లో ఒక్కో ఆంపోటెరిస్సిన్ - B ఇంజెక్షన్‌ను రూ. 35 వేలకు అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. మనీష్ తన ఇంట్లో వాళ్లకు సీరియస్‌గా ఉందని తెలిసిన వాళ్ళ దగ్గర మందులు కొంటున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

Advertisement