చాణ‌క్య నీతి: మీ డబ్బు, చదువు అలాంటి పరిస్థితుల్లో అస్స‌లు పనికి రాదు.. మ‌రేం చేయాలి?

ABN , First Publish Date - 2021-11-22T12:04:13+05:30 IST

కౌటిల్యునిగా ప్రసిద్ధి చెందిన ఆచార్య చాణక్య..

చాణ‌క్య నీతి: మీ డబ్బు, చదువు అలాంటి పరిస్థితుల్లో అస్స‌లు  పనికి రాదు.. మ‌రేం చేయాలి?

కౌటిల్యునిగా ప్రసిద్ధి చెందిన ఆచార్య చాణక్య తన ప‌దునైన వ్యూహాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. చంద్రగుప్త మౌర్య‌ను త‌న విధానాల ద్వారా మగధ చక్రవర్తిగా చేయడంలో చాణక్య కీల‌క‌ పాత్ర పోషించాడు. ఆచార్య చాణక్యకు సమాజంలోని దాదాపు అన్ని విషయాలపై లోతైన అవగాహన ఉంది. అందుకే ఆచార్య చాణ‌క్య మ‌నిషి జీవితానికి ప‌నికొచ్చే నీతిని కూడా రూపొందించాడు. దాని ద్వారా సమాజానికి మంచి మార్గనిర్దేశం చేశాడు. చాణక్య విధానాలు ప్రస్తుత కాలంలో కూడా సందర్భోచితంగా వ‌ర్తింపచేయ‌గ‌లిగేలా ఉన్నాయి. ఆచార్య చాణక్య పేర్కొన్న‌ విధానాలను అనుసరించిన‌వారు జీవితంలో ఎప్పుడూ అపజయాన్ని పొందర‌ని పండితులు చెబుతుంటారు. ఆచార్య చాణక్య తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశాడు. డబ్బుకు గ‌ల ప్రాధాన్య‌త‌ను గుర్తించాడు. డ‌బ్బు మ‌న‌ల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయట ప‌డేస్తుండ‌ని చెబుతూనే, కొన్ని సంద‌ర్భాల్లో డ‌బ్బు ప్ర‌మేయం కూడా ఉండ‌ద‌ని కూడా చెప్పాడు. అదేవిధంగా మ‌నం నేర్చుకున్న విద్య కూడా కొన్ని సంద‌ర్భాల్లో ఉపయోగపడదని చాణ‌క్య తెలిపాడు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.



పుస్తకాల‌తో వ‌చ్చే విద్య: 

ఆచార్య చాణక్య తెలిపిన వివ‌రాల ప్రకారం కేవ‌లం పుస్తకాల‌లో ఉన్న జ్ఞానం వల్ల ఉపయోగం లేదు. పుస్తకాలకే పరిమితమైన జ్ఞానం కొన్ని స‌మ‌యాల‌లో ఉప‌యోగ‌ప‌డ‌ద‌ని చాణక్య  తెలిపారు. అందుకే ఎవ‌రైనా స‌రే పుస్తక జ్ఞానానికితోడుగా ఆచరణాత్మక జ్ఞానం గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమ‌ని తెలియ‌జెప్పాడు.  గురువు నుంచి జ్ఞానాన్ని గ్ర‌హించేట‌ప్పుడు విద్యార్థి తన ఉత్సుకతను అణచివేయకూడ‌ద‌ని చాణ‌క్య చెబుతాడు. ఎందుకంటే మిడిమిడి జ్ఞానం ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుందని చాణ‌క్య హెచ్చ‌రించాడు.

ఇతరుల వద్ద దాచిన డ‌బ్బు: 

ఆచార్య చాణక్య తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మీ డ‌బ్బు వేరొకరి వద్ద ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే మీరు కూడబెట్టే సంప‌ద మీ ఆధీనంలోనే ఉండాలి. చాలామంది తమ డబ్బును వేరొకరికి ద‌గ్గ‌ర దాస్తుంటారు. ఇటువంటి సంప‌ద సమయం వచ్చినప్పుడు అందుబాటులోకి రాక ఇబ్బందులు ఎదుర్కొంటార‌ని చాణక్య తెలిపారు.

Updated Date - 2021-11-22T12:04:13+05:30 IST