Sep 18 2021 @ 21:52PM

‘యూత్ అబ్బా మేము’ పాట వదిలిన మంత్రి తలసాని

ప్రసాద్ ఏలూరి దర్శకత్వంలో సముద్రాల సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై చిన్ను క్రిష్, గీతిక రతన్ హీరోహీరోయిన్లుగా సముద్రాల మంత్రయ్య బాబు నిర్మించిన  చిత్రం ‘లవ్ యు రా’. తాజాగా ఈ చిత్రంలోని ‘యూత్ అబ్బా మేము’ అనే పాటను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘కంచరపాలెం’ మ్యూజిక్ డైరెక్టర్ స్వీకర్ అగస్థి ఈ పాటను ఆలపించగా.. రత్నం బట్లురి సాహిత్యం అందించారు. ఈశ్వర్ పెరవలి సంగీత దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది.  


ఈ సందర్భంగా నిర్మాత సముద్రాల మంత్రయ్య బాబు మాట్లాడుతూ.. ‘‘మా విన్నపాన్ని గౌరవించి ఈ సినిమాలోని పాటను విడుదల చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌గారికి కృతజ్ఞతలు. దర్శకుడు అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం..’’ అని తెలుపగా దర్శకుడు ప్రసాద్ ఏలూరి మాట్లాడుతూ.. పాటను విడుదల చేసిన తలసానిగారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ కథను వినగానే ఓకే చేసిన నిర్మాతగారికి కృతజ్ఞతలు. ఆయన ఇచ్చిన ఈ అవకాశం వినియోగించుకుంటాను. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.. అన్నారు.