మొబైల్‌ ఎంత పని చేసింది.. తిండి, నిద్ర వదిలేసి మొబైల్‌తోనే గడిపాడు.. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2021-11-30T19:06:09+05:30 IST

ప్రస్తుతం ప్రపంచాన్ని స్మార్ట్‌ఫోన్ శాసిస్తోంది. మొబైల్ లేకుండా రోజు గడపడం కష్టసాధ్యంగా మారిపోయింది.

మొబైల్‌ ఎంత పని చేసింది.. తిండి, నిద్ర వదిలేసి మొబైల్‌తోనే గడిపాడు.. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే..

ప్రస్తుతం ప్రపంచాన్ని స్మార్ట్‌ఫోన్ శాసిస్తోంది. మొబైల్ లేకుండా రోజు గడపడం కష్టసాధ్యంగా మారిపోయింది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఎంతో మంది మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారిపోయారు. పక్కవారితో సంబంధం లేకుండా మొబైల్‌తోనే కాలం గడిపేస్తున్నారు. యువత అయితే తిండి, నిద్రను కూడా పట్టించుకోకుండా మొబైల్‌తోనే కాలక్షేపం చేస్తోంది. అలా మొబైల్‌ను అతిగా వినియోగించిన ఓ యువకుడు మానసిక రోగిగా మారిపోయాడు. తన కుటుంబ సభ్యులను కూడా గుర్తు పట్టలేని స్థితికి వెళ్లిపోయాడు. 


రాజస్థాన్‌లోని చురూ ప్రాంతానికి చెందిన యువకుడు అక్రమ్ రోజంతా మొబైల్‌తోనే గడిపేవాడు. నిరంతరం సోషల్ మీడియాను ఫాలో అయ్యేవాడు. పగలు మాత్రమే కాకుండా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నిద్ర కూడా పోకుండా మొబైల్ చూస్తూనే ఉండేవాడు. ఇలా ఒకరోజు కాదు.. ఎన్నో రోజులు అక్రమ్ నిద్రకు దూరమవడంతో మానసిక రోగిగా మారిపోయాడు. కుటుంబ సభ్యులను, బంధువులను గుర్తు పట్టలేని స్థితికి వెళ్లిపోయాడు. అక్రమ్ ప్రవర్తనలో తేడా రావడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అతనిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. 


అక్రమ్‌ను పరీక్షించిన వైద్యులు నిద్ర లేకపోవడం వల్ల మానసిక రోగిగా మారినట్టు గుర్తించారు. అతడి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని చెబుతున్నారు. తిండి, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల సమస్య తలెత్తిందని తెలిపారు. ప్రస్తుతం అనారోగ్యంతో చికిత్స అందుకుంటున్న సమయంలోనూ మొబైల్ కావాలని అక్రమ్ గొడవపెడుతున్నాడు. ప్రస్తుతం ఐసీయూలో అక్రమ్‌ను ఉంచి వైద్యులు చికిత్స చేస్తున్నారు. 

Updated Date - 2021-11-30T19:06:09+05:30 IST