యువకుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-08T11:27:33+05:30 IST

మున్సిపాలిటి పరిధిలోని కుటాగుళ్లలో చిన్నకట్ట వీధికి చెందిన భీముడు(34) అప్పుల బాధతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎ్‌సఐ జయప్ప తెలిపారు.

యువకుడు ఆత్మహత్య

కదిరి: మున్సిపాలిటి పరిధిలోని కుటాగుళ్లలో చిన్నకట్ట వీధికి చెందిన భీముడు(34) అప్పుల బాధతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎ్‌సఐ జయప్ప తెలిపారు. ఆయన తెలిపిన మేరకు కుటాగుళ్లలోని చిన్న కట్ట వీధికి చెందిన భీముడు రోళ్లు కొట్టుకొని జీవనం సాగించేవాడు. గ్రామంలో ఉన్న  ఓ ఇంటిని రూ.2 లక్షలకు కొన్నాడు. దీంతో అప్పులు ఎక్కువయ్యాయి.  శుక్రవారం మధ్యా హ్నం ఇంట్లో భార్య ఉండగా, ఇంటికి సమీపంలో బీరు బాటిల్‌ తాగుతూ కిందకు పడిపోయాడు. గమనించిన భార్య, స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా ఎర్రగుళికల మందు కనిపించింది. దీంతో వారు వెంటనే కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే  అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య శంకరమ్మ ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి నట్లు ఏఎ్‌సఐ తెలిపారు. 

Updated Date - 2020-03-08T11:27:33+05:30 IST