యువకుడి అదృశ్యం

ABN , First Publish Date - 2021-04-18T05:59:34+05:30 IST

యువకుడి అదృశ్యం

యువకుడి అదృశ్యం
రాజు (ఫైల్‌)

హన్మకొండ రూరల్‌, ఏప్రిల్‌ 17 : హన్మకొండ సుబేదారి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని దీన్‌దయాల్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అదృశ్యమైనట్లు సుబేదారి సీఐ రాఘవేందర్‌ తెలిపారు. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న లావుడ్య రాజు మార్చి 29న ద్విచక్ర వాహనంపై ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యు లు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో రాజు తల్లి లావుడ్య రూప శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 


Updated Date - 2021-04-18T05:59:34+05:30 IST