Abn logo
Sep 25 2021 @ 01:09AM

సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి

విద్యార్థులకు నోట్‌ బుక్కులు పంపిణీ చేస్తున్న డీఈవో

- డీఈవో మాధవి

పెద్దపల్లి రూరల్‌, సెప్టెంబరు 24 : సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలని జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు. శుక్రవారం మండలంలోని హన్మంతునిపేట గ్రామంలోని జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులకు లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నోట్‌ బుక్కులు, మాస్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా డీఈవో హాజరయ్యారు. ఈ సందర్భం గా డీఈవో మాధవి మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను, వారి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ తీగల సదయ్య, క్లబ్‌ అధ్యక్షు డు అయాజ్‌, జోన్‌ చైర్మన్‌ అశోక్‌, బాలకిషన్‌ జకోటియా, కావెటి రాజగోపాల్‌, జైపాల్‌రెడ్డి, అజిజ్‌, వెంకట్‌, బాబురావు పాల్గొన్నారు.