యువత ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2021-01-26T06:39:19+05:30 IST

దేశ భవి ష్యత్‌ యువత చేతిలో ఉందని, వారు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి పీవీ జ్యోతిర్మయి అన్నారు

యువత ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి
మాట్లాడుతున్నజిల్లా ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి

జిల్లా జడ్జి జ్యోతిర్మయి

ఒంగోలు (కలెక్టరేట్‌), జనవరి 25 : దేశ భవి ష్యత్‌ యువత చేతిలో ఉందని, వారు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి పీవీ జ్యోతిర్మయి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక స్పందన హాలులో జరిగిన సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడా రు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. బహుమతులకు, ప్రలోభాలకు లోనుకాకుడదన్నారు. జేసీ జె.వెంక టమురళి మాట్లాడుతూ ఓటును గౌరవంగా, బా ధ్యతగా, హక్కుగా భావించి యువత ఎన్నికల్లో పాల్గొనాలని తెలిపారు. జిల్లా జనాభా 36,96,007మంది కాగా, అందులో 26,66,929మంది ఓటర్లుగా ఉన్నారని తెలిపారు. అంటే జనాభాలో 72.2 శాతం మంది ఓటర్లుగా ఉన్నారని తెలి పారు. గత ఎన్నికల్లో జిల్లాలో 86.09శాతం పోలింగ్‌ నమోదుతో రాష్ట్రం లోనే ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. జేసీ కృష్ణవేణి, డీఆర్వో కె.వి నాయకం, ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి,  ఒంగోలు తహసీల్దార్‌ చిరంజీవి, ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్‌ ఎం. నాగేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-26T06:39:19+05:30 IST