25వేల ఖాతాలు బ్యాన్ చేసిన యూట్యూబ్.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2020-07-01T01:36:15+05:30 IST

జాతివివక్షతను సమర్థిస్తూ పోస్టులు పెడుతున్న వారి ఖాతాలను యూట్యూబ్ బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో...

25వేల ఖాతాలు బ్యాన్ చేసిన యూట్యూబ్.. కారణం ఇదే..

కాలిఫోర్నియా: జాతివివక్షతను సమర్థిస్తూ పోస్టులు పెడుతున్న వారి ఖాతాలను యూట్యూబ్ బ్యాన్ చేసింది. ఈ నేపథ్యంలో దాదాపు 25వేలకు పైగా చానెళ్లను యూట్యూబ్ తొలగించింది. యూట్యూబ్ నిబంధనలను అతిక్రమించడమే కాకుండా వివాదాత్మక విషయాలను ప్రచారం చేస్తున్నందుకే వీరి చానెళ్లను బ్యాన్ చేయడం జరిగిందని యూట్యూబ్ ప్రకటించింది. ఇదిలా ఉంటే యూట్యూబ్ బ్యాన్ చేసిన చానెళ్లలో కొందరికి దాదాపు 10లక్షల పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అంతమందిని ఫాలోవర్లున్న చానెళ్లను యూట్యూబ్ నిషేధించడంతో వారంతా ట్విటర్ ద్వారా తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. తమ చానెళ్లను అన్యాయంగా బ్యాన్ చేశారని, వెంటనే వాటిని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికోసం యూట్యూబ్‌పై అందరూ ఒత్తిడి తీసుకురావాలని ట్విటర్ వేదికగా కోరుతున్నారు.

Updated Date - 2020-07-01T01:36:15+05:30 IST