తొందర పడకు సుందర వదనా

ABN , First Publish Date - 2021-02-24T06:45:28+05:30 IST

ట్యాలెంట్‌ను చాటుకునేందుకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు లఘుచిత్రాలు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. అలాంటిదే తొందరపడకు సుందర వదనా ఎపిసోడ్‌ 2...

తొందర పడకు సుందర వదనా

ట్యాలెంట్‌ను చాటుకునేందుకు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు లఘుచిత్రాలు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. అలాంటిదే తొందరపడకు సుందర వదనా ఎపిసోడ్‌ 2. మొదటి ఎపిసోడ్‌ లాగానే ఇది కూడా అలరిస్తుంది. కారులో స్నేహితురాలితో వెళుతున్న హీరో ఆమె అడగడంతో తన ప్రేమకథ, బ్రేకప్‌ గురించి చెప్పడం మొదలెడతాడు. ఇంజనీరింగ్‌ కాలేజీలో ఎంటర్‌ అవ్వగానే సీనియర్లు ర్యాగింగ్‌ చేసే సీన్‌. అందులో సీనియర్‌ హీరోకి ‘ఐ లవ్యూ’ చెబుతుంది. తరువాత అతడిని మరో అమ్మాయికి ‘ఐ లవ్యూ చెప్పమంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు అతడు కాలేజీ రోజుల్లో ఇష్టపడిన ‘మీనా’. కానీ ఆమె అతడిని పెద్దగా పట్టిచ్చుకోదు. ఒకరోజు కాలేజీలో సీనియర్లు మీనా గురించి తప్పుడుగా మాట్లాడడం నచ్చక వారితో గొడవపడతాడు. ఆ క్రమంలో హెచ్‌వోడి కొడుకు హీరోపై చేయిచేసుకుంటాడు. అయితే హీరో హెచ్‌వోడి క్యాబిన్‌లోకి వెళ్లి ‘మీ అబ్బాయి పద్ధతి మార్చుకొమ్మని చెప్పండి. ఇలాంటివి మళ్లీ జరగొద్దు’ అని వార్నింగ్‌ ఇస్తాడు. ఈ విషయం తెలిసి మీనా హీరోను ఇష్టపడుతుంది. ఈలోగా పరీక్ష ఫలితాలు వస్తాయి. మీనా పాసవుతుంది. మీనాకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలో జాబ్‌ వ స్తుంది. హీరోకు కెరీర్‌ పట్ల ప్లానింగ్‌ లేదని చెప్పి మీనా అతడిని వదిలేసి వెళ్లిపోతుంది. ‘ఇదండీ ‘తొందరపడకు సుందర వదన ఎపిసోడ్‌ 2’ కథ. కాలేజీ ర్యాగింగ్‌ సీన్లు, నటీనటుల అభినయం ఈ షార్ట్‌ ఫిలిమ్‌కు ప్లస్‌. అయిదు రోజుల క్రితం యూట్యూబ్‌లో విడుదలైన ఈ లఘుచిత్రానికి ఇప్పటికే పదిలక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

Updated Date - 2021-02-24T06:45:28+05:30 IST