ఇండియన్‌ క్రియేటర్లకు యూట్యూబ్‌ పేమెంట్స్‌

ABN , First Publish Date - 2021-05-15T05:34:09+05:30 IST

నిజమే, టిక్‌టాక్‌కు ప్రత్యర్ధి కావాలన్న లక్ష్యంలో భాగంగా భారత్‌లోని సంబంధిత వీడియో(షార్ట్స్‌)ల సృష్టికర్తలకు చెల్లింపులు జరపాలని యూట్యూబ్‌ నిర్ణయించింది

ఇండియన్‌ క్రియేటర్లకు యూట్యూబ్‌ పేమెంట్స్‌

నిజమే, టిక్‌టాక్‌కు ప్రత్యర్ధి కావాలన్న లక్ష్యంలో భాగంగా భారత్‌లోని సంబంధిత వీడియో(షార్ట్స్‌)ల సృష్టికర్తలకు చెల్లింపులు జరపాలని యూట్యూబ్‌ నిర్ణయించింది. టిక్‌టాక్‌కు పోటీగా యూట్యూబ్‌ షార్ట్స్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికోసం ప్రత్యేకంగా వంద మిలియన్‌ డాలర్లతో ఒక నిధిని యూట్యూబ్‌ ఏర్పాటు చేసింది. ‘ద వెర్జ్‌’ నివేదిక ప్రకారం నెలవారీ ప్రాతిపదికన సదరు సృష్టికర్తలతో యూట్యూబ్‌ టచ్‌లో ఉంటుంది. విస్తృత ప్రాతిపదికన, పెద్ద ఎత్తున వీక్షకులను ఇవి ఆకట్టుకోవాలి. అలాగే సొంతంగా రూపొందించినవి అయి ఉండాలి. అయితే పేమెంట్‌ ఎలా, ఎంత మొత్తం అన్నది మాత్రం వెల్లడి కాలేదు. ఎవరు పోస్ట్‌ చేసిన షార్ట్స్‌ అయినా నిబంధనలకు లోబడి ఉంటే పేమెంట్‌కు అర్హత పొందుతాయి. ఇండియాకు తోడు అమెరికాకు చెందిన ఈ షార్ట్స్‌ సృష్టికర్తలకూ సదరు ఫండ్‌ నుంచి పేమెంట్‌ చేస్తారు. ఈ ఏడాది ఆరంభమైన నిధి, వచ్చే ఏడాది కొంత కాలం వరకు ఉనికిలో ఉంటుంది. నిషేధానికి గురైనప్పటికీ టిక్‌టాక్‌ గత ఏడాది జూలైలోనే 200 మిలియన్‌ డాలర్లతో నిధిని ఏర్పాటు చేసింది. దానికి పోటీగానే యూట్యూబ్‌ ఇప్పుడు ఫండ్‌ను ఆరంభించింది. అలాగే టిక్‌టాక్‌కు పోటీదారు స్నాప్‌చాట్‌ ఏకంగా రోజుకు ఒక మిలియన్‌ డాలర్ల మొత్తాన్ని ఈ వీడియో సృష్టికర్తలకు చెల్లిస్తోంది. మొత్తానికి ఒరిజినల్‌ ఐడియాతో షార్ట్స్‌ను రూపొందించే వ్యక్తులకు ఈ ఆఫర్లు నిజంగా పండగే అని చెప్పవచ్చు. 

Updated Date - 2021-05-15T05:34:09+05:30 IST