కరోనాపై తప్పుడు సమాచారం.. దేశాధ్యక్షుడి వీడియోలు తొలగించిన యూట్యూబ్

ABN , First Publish Date - 2021-07-23T11:41:52+05:30 IST

ప్రపంచంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో.. ఈ వైరస్ గురించి తప్పుడు సమాచారాన్ని

కరోనాపై తప్పుడు సమాచారం.. దేశాధ్యక్షుడి వీడియోలు తొలగించిన యూట్యూబ్

బ్రజీలియా: ప్రపంచంలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో.. ఈ వైరస్ గురించి తప్పుడు సమాచారాన్ని దూరం చేయడానికి సోషల్ మీడియా సంస్థలు ముందడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే వివాదాస్పద బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బొల్సనారోకు సంబంధించిన కొన్ని వీడియోలను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించాలని ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సైట్ యూట్యూబ్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే బొల్సనారోకు చెందిన యూట్యూబ్ ఛానెల్‌లోని కొన్ని వీడియోలను తొలగించింది. ‘‘కరోనాను నియంత్రించడానికి హైడ్రాక్సీక్లోరోక్విన్ సరిపోతుంది.. మాస్కులు కరోనాను నియంత్రించలేవు’’ అంటూ తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేసే కంటెంట్‌ను తమ నిబంధనలు అనుమతించవని యూట్యూబ్ స్పష్టం చేసింది. చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీని వెనుక ఎటువంటి రాజకీయ లేక ఐడియాలజీకి సంబంధం అంశాల ప్రభావం లేదని తేల్చిచెప్పింది. కాగా, కరోనా వేగంగా వ్యాపిస్తున్న సమయంలో కూడా బొల్సనారో మాస్కులు ధరించడం వేస్ట్ అనడం, సామాజిక దూరం పాటించకపోవడం, లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

Updated Date - 2021-07-23T11:41:52+05:30 IST