ప్రముఖ టీవీ చానల్‌కు యూట్యూబ్ షాక్..!

ABN , First Publish Date - 2021-08-02T01:15:13+05:30 IST

ఆస్ట్రేలియాలోని ప్రముఖ టీవీ చానల్‌ స్కైన్యూస్‌కు యూట్యూబ్ భారీ షాకిచ్చింది.

ప్రముఖ టీవీ చానల్‌కు యూట్యూబ్ షాక్..!

క్యాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలోని ప్రముఖ టీవీ చానల్‌ స్కైన్యూస్‌కు యూట్యూబ్ భారీ షాకిచ్చింది. తన యూట్యూబ్ ఛానల్‌లో స్కైన్యూస్ వారం పాటు ఎటువంటి కంటెంట్ అప్‌లోడ్ చేయకుండా నిషేధం విధించింది. కొవిడ్‌కి సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందన్న కారణంతో యూట్యూబ్ ఈ చర్యకు దిగింది. స్కైన్యూస్ చానల్‌లోని కంటెంట్ కారణంగా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని సంస్థ ఈ సందర్భంగా పేర్కొంది. తప్పుడు సమాచారం కట్టడి కోసం త్రీ స్ట్రైక్ విధానాన్ని యూట్యూబ్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్కైన్యూస్‌కు యూట్యూబ్ తొలి స్ట్రైక్ జారీ చేసింది. మూడు స్ట్రైక్‌లు జారీ అయిన చానల్‌ను యూట్యూబ్ శాశ్వతంగా తొలగిస్తుంది. కాగా.. ఈ చర్యపై స్కైన్యూస్ డిజిటల్ ఎడిటర్ స్పందించారు. ఈ చర్యను భావప్రకటనా స్వేఛ్చపై దాడిగా అభివర్ణించారు.

Updated Date - 2021-08-02T01:15:13+05:30 IST