తాలిబన్ల యూట్యూబ్ వీడియోలు.. భారీగా వచ్చిపడ్డ వ్యూస్!

ABN , First Publish Date - 2021-08-20T02:07:10+05:30 IST

అప్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌ను తమ వశం చేసుకుంటున్న తరుణంలో తాలిబన్ నాయకులు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన కొన్ని వీడియోలకు విపరీతంగా వ్యూస్ వచ్చిపడ్డాయి.

తాలిబన్ల యూట్యూబ్ వీడియోలు.. భారీగా వచ్చిపడ్డ వ్యూస్!

కాబూల్: అప్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌ను తమ వశం చేసుకుంటున్న తరుణంలో తాలిబన్ నాయకులు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన కొన్ని వీడియోలకు విపరీతంగా వ్యూస్ వచ్చిపడ్డాయి. ఏకంగా 5 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయని తెలుస్తోంది. ఆ సమయంలో తాలిబన్లు మొత్తం ఐదు వీడియోలను అప్‌లోడ్ చేశారట. అఫ్ఘానిస్థాన్ తమ చేతుల్లోకి వస్తుండటంతో.. సీనియర్ నాయకులు ఇతర తాలిబన్లకు శుభాకాంక్షలు చెబుతున్న దృశ్యాలు ఈ వీడియోల్లో ఉన్నాయి. ‘‘దేశానికి సేవ చేసేందుకు..ప్రజలకు శాంతిభద్రతలు కల్పించేందుకు సమయం వచ్చింది’’ అని తాలిబన్‌ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ఓ వీడియోలో పిలుపు నిచ్చారు. 

Updated Date - 2021-08-20T02:07:10+05:30 IST