ఔషధాల బ్లాక్‌ మార్కెటింగ్‌కు చెక్‌!

ABN , First Publish Date - 2020-04-09T09:10:23+05:30 IST

ఔషధాల బ్లాక్‌ మార్కెటింగ్‌కు చెక్‌!

ఔషధాల బ్లాక్‌ మార్కెటింగ్‌కు చెక్‌!

ఏపీ ఇండస్ట్రీస్‌ కొవిడ్‌-19 పోర్టల్‌ ఆవిష్కరించిన సీఎం జగన్‌


అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో వైద్య పరికరాలు, మాస్క్‌లు, శానిటైజర్‌, మందులు వంటి వాటి బ్లాక్‌మార్కెటింగ్‌ను నిరోధించడంతోపాటు, వాటి ధరలను ఎప్పటికప్పుడు పరిశీలించేలా రాష్ట్ర పరిశ్రమల శాఖ ఏపీ ఇండస్ట్రీస్‌ కొవి డ్‌-19 రెస్పాన్స్‌ పోర్టల్‌ను రూపొందించింది. ఈ పో ర్టల్‌ను సీఎం జగన్‌ బుధవారం ఆవిష్కరించారు. ఈ పోర్టల్‌లో రాష్ట్రంలో వైద్య పరికరాలు, అనుబంధ ఉత్పత్తులను తయారు చేసే 112 కంపెనీలను పరిశ్రమల శాఖ చేర్చింది. ఇవన్నీ నిత్యావసర వస్తువుల పరిధిలోకి వస్తున్నందున వాటి ఉత్పత్తుల కొనసాగింపు.. ధరల నియంత్రణ తదితర అంశాలను పరిశ్రమల శాఖ నేరుగా పరిశీలించనుంది. ప్రస్తుతం.. పలు మెడికల్‌.. మెడికల్‌ ఆధారిత వస్తువుల ధరలు నియంత్రణలో లేకపోవడం.. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బ్లాక్‌మార్కెట్‌కు తరలించడం వంటి చర్యలను నిరోధించేందుకు వీలుగా పరిశ్రమల శాఖ దీనిని వినియోగించనుంది. 

Updated Date - 2020-04-09T09:10:23+05:30 IST