Abn logo
Dec 3 2020 @ 16:46PM

వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణానికి పాలన అనుమతులు

అమరావతి: వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణానికి ప్రభుత్వం పాలన అనుమతులు ఇచ్చింది. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీల నిర్మాణం చేపట్టాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. మొదటి దశలో 15.10 లక్షలు, రెండో విడతలో 13.2 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. నిర్మాణాలకు రూ.24,776 కోట్లు ఖర్చు చేయనుంది. ఇళ్ల పట్టాలు, భూమి గలవారు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇళ్ల నిర్మాణానికి ఇంటికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్ల నిర్మాణ సంస్థను రివర్స్ టెండరింగ్ ద్వారా ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇళ్ల నిర్మాణ ఏజెన్సీ ఎంపిక కోసం రాష్ట్రస్థాయి కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వైఎస్ఆర్ కాలనీలకు నీటి సరఫరా కోసం రూ.920 కోట్లను కేటాయించింది. 

Advertisement
Advertisement
Advertisement