గన్నేరుపప్పు పేరుని సార్థకం చేసుకున్నారు: లోకేశ్ ట్వీట్

ABN , First Publish Date - 2020-05-30T18:32:16+05:30 IST

జగన్ సర్కార్ ఏడాది పాలనపై ప్రతిపక్షాల విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

గన్నేరుపప్పు పేరుని సార్థకం చేసుకున్నారు: లోకేశ్ ట్వీట్

ఇంటర్నెట్ డెస్క్: జగన్ సర్కార్ ఏడాది పాలనపై ప్రతిపక్షాల విమర్శల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జగన్ పాలనపై వరుస ట్వీట్లు చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తాజాగా మరో ట్వీట్ చేశారు. ‘‘ఏడాది పాలనలో 87 వేల కోట్ల అప్పు, పైగా రాష్ట్ర ఆస్తుల అమ్మకం.. ఒక్క ఛాన్స్ అడిగి రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని నాశనం చేసి ''గన్నేరుపప్పు'' పేరుని సార్ధకం చేసుకున్నారు’’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 




అంతకుముందు చేసిన ట్వీట్‌లో జగన్ ఏడాది పాలనలో 65 కోర్టు మొట్టికాయలు, రాజ్యాంగ అతిక్రమణలు, కోర్టు ధిక్కారాలు ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో తుగ్లక్ ప్రభుత్వం, తీవ్రవాద ప్రభుత్వం అంటూ వచ్చిన బిరుదులు, భూకబ్జాలు, స్కాములు, మంత్రుల బూతులు, భజనలు, దౌర్జన్యాలు ఉన్నాయని చెప్పుకోవాలన్నారు. ఇక ప్రజల బాగు విషయానికి వస్తే 60 మంది నిర్మాణరంగ  కార్మికులు, 65 మంది రాజధాని రైతులు, 750 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని, 160 రోజులుగా అమరావతి కోసం మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమం కొనసాగుతూనే ఉందన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారని విమర్శించారు.

Updated Date - 2020-05-30T18:32:16+05:30 IST