ఆరో తరగతి కూడా చదవని వారిని మంత్రులు చేస్తారట: షర్మిల

ABN , First Publish Date - 2021-10-06T00:58:38+05:30 IST

కేసీఆర్ హయాంలో నిరుద్యోగం ఏడింతలు పెరిగిందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలు తెచ్చి వైఎస్సార్నిజామాబాద్ జిల్లా ప్రజలకు తాగునీరు అందించారని గుర్తుచేశారు.

ఆరో తరగతి కూడా చదవని వారిని మంత్రులు చేస్తారట: షర్మిల

హైదరాబాద్: కేసీఆర్ హయాంలో నిరుద్యోగం ఏడింతలు పెరిగిందని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలు తెచ్చి  వైఎస్సార్నిజామాబాద్ జిల్లా ప్రజలకు తాగునీరు అందించారని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, దేనికీ డబ్బులు లేవన్నారు. తెలంగాణ బీర్లు, బార్ల తెలంగాణగా మారిందని ఆమె విమర్శించారు. డిగ్రీలు చదివిన వారు కూలీలుగా మారుతుంటే.. ఆరో తరగతి కూడా చదవని వారిని మంత్రులు చేస్తారట అని విమర్శించారు. అసెంబ్లీలో తెలంగాణ ప్రజలు చేతకాని వారని మాట్లాడిన కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు పాలించడం చేతకాకపోతే దళితుడిని సీఎం చేసి ఫామ్‌హౌస్‌లో పడుకోండని విమర్శించారు. 

Updated Date - 2021-10-06T00:58:38+05:30 IST