Abn logo
Oct 21 2021 @ 18:49PM

సీఎం కేసీఆర్‌పై షర్మిల ఫైర్

చేవేళ్ళ: తన జీవితం తెలంగాణకే అంకితమని వైఎస్‌ షర్మిల అన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. కూలి నాలి చేసి చదివిస్తే పిల్లలకు ఉద్యోగాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చస్తే ఉద్యోగాలు తగ్గుతాయని కేసీఆర్‌ అనుకుంటున్నారని విమర్శించారు. ప్రజలను మోసం చేసిన దగాకోరు కేసీఆర్ అన్నారు. వరి వేసుకుంటే ఉరి అని కేసీఆర్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది పండించాలనే హక్కు రైతుకు లేకుంటే ఎలా? అని ఆమె ప్రశ్నించారు. ఇచ్చేది రూ.5 వేలు... పట్టుకునేది రూ.20 వేలు అన్నారు. వ్యవసాయంలో అన్ని పథకాలు తీసేసి రూ.5 వేలు ఇస్తున్నారని పేర్కొన్నారు. 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption