Abn logo
Jul 8 2021 @ 18:34PM

వైఎస్‌ చేసిన సంక్షేమ సంతకం ఇప్పటికీ రోల్‌మోడల్‌: షర్మిల

హైదరాబాద్: వైఎస్‌ కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయిన సంక్షేమ సంతకమని వైఎస్ షర్మిల అన్నారు. ఎంత కష్టమైన పనైనా వెనకడుగు వేయలేదని గుర్తుచేశారు. వైఎస్‌ ఏ పనినైనా గుండె నిబ్బరంతో సాధించారని చెప్పారు. వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ రాయదుర్గంలో జరుగుతోంది. సభలో షర్మిల మాట్లాడుతూ..  సాయం అడిగితే రాజకీయాలకు అతీతంగా చేశారని కొనియాడారు. ఇవాళ వైఎస్సార్‌ జయంతి.. మనకు పండుగ రోజన్నారు. ఆయన పుట్టినరోజునే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని స్థాపిస్తున్నామన్నారు. 


వైఎస్‌ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తామని స్పష్టం చేశారు. వైఎస్‌ చేసిన సంక్షేమ సంతకం ఇప్పటికీ రోల్‌మోడల్‌ అన్నారు. రైతులు చల్లగా ఉండాలని రుణమాఫీ చేశారని ఆమె గుర్తుచేశారు. ఉచిత విద్యుత్‌, పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారని గుర్తుచేశారు. కోటి ఎకరాలకు నీరు ఇవ్వడం కోసం జలయజ్ఞానికి వైఎస్‌ రూపకల్పన చేశారని గుర్తుచేశారు. పేద విద్యార్థులకు వందశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేశారని వ్యాఖ్యానించారు. జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చి లక్షల ఉద్యోగాలను వైఎస్‌ భర్తీ చేశారని పేర్కొన్నారు. మహిళలు లక్షాధికారులు అవ్వాలని పావలా వడ్డీకే రుణాలు ఇప్పించారని చెప్పారు. నిరుపేదలకు వైఎస్‌ భూమి ఇచ్చారని గుర్తు చేశారు.

తెలంగాణ మరిన్ని...