Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరోసారి తెరపైకి వచ్చిన Viveka గుండెపోటు చిత్రీకరణ వ్యవహారం

కడప: వైఎస్ వివేకా హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. తాజాగా మరోసారి వైఎస్ వివేకా గుండెపోటు చిత్రీకరణ వ్యవహారం తెరపైకి వచ్చింది. తొలుత వివేకా గుండెపోటుతో మృతి చెందారంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయనది హత్యగా తేలింది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు తాజాగా వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో నాటి గుండెపోటు చిత్రీకరణ వ్యవహారంపై ఆరా తీశారు. వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు మొదట ఎలా ప్రసారం చేశారని సాక్షి ప్రతినిధిని ప్రశ్నించినట్లు సమాచారం. ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏలను కూడా గుండెపోటు వ్యవహారంపై సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

Advertisement
Advertisement