Abn logo
Aug 17 2021 @ 14:23PM

వివేకా హత్య కేసులో కొత్త ట్విస్టు

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. మంగళవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి కీలక అనుమానితుడుగా ఉన్నారు. వివేకా కుమార్తె సునీత ఇచ్చిన 15మంది అనుమానితుల లిస్టులో కూడా భాస్కర్ రెడ్డి పేరు మొదటగా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో సీసీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని మొదటి సారిగా పిలిపించారు. మొదటి నుంచి భాస్కర్ రెడ్డి విచారణకు వస్తారా, రారా.. అని ప్రజలతో పాటూ వైఎస్ సునీత కూడా భావిస్తూ వచ్చారు.

వివేకా హత్య వెనుక ఏఏ కారణాలు ఉన్నాయని అధికారులు విచారిస్తున్నారు. అలాగే రాజకీయ వివాదాలు, ఆర్థిక లావాదేవీలపై భాస్కర్ రెడ్డిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి కీలకమైన ఆధారాలు సేకరిస్తున్న సీబీఐ అధికారులు.. ఈ కేసులో సెంట్రల్ జైల్‌లో ఉన్న అనుమానితుడు సునిల్ నుంచి, కీలక సమాచారం తీసుకున్నట్లు తెలుస్తోంది. సునిల్ తమ్ముడు కిరణ్ మాట్లాడుతూ సింహాన్ని సింహమే చంపుతుంది కానీ.. చిట్టెలుకలు చంపుతాయా అని వాపోయారు. ఈ కేసు వెనుక ఉన్న పెద్దవారి పేర్లను బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.