Advertisement
Advertisement
Abn logo
Advertisement

వివేకా హత్యపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అల్లరి చేస్తోంది: రాచమల్లు

కడప: వైఎస్ వివేకా హత్య కేసు డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం రిపోర్టు‌పై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం రిపోర్టు‌ను పట్టుకొని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అల్లరి చేస్తోందని ఆయన మండిపడ్డారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి కుటుంబం ప్రమేయం ఉందని నిరూపిస్తే.. కడప జిల్లా ఎమ్మెల్యేలమందరం మూకుమ్మడిగా రాజీనామా చేస్తామన్నారు. కడప జిల్లాలోని ఎమ్మెల్యేలందరం కలిసి మాట్లాడుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని  ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు.  అవినాష్ రెడ్డిని హంతకుడిగా చిత్రీకరించే ప్రయత్నం తెరవెనుక చేస్తున్నారని చెప్పారు. తనకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఎర్రగంగిరెడ్డి మరో ముగ్గురిని కలుపుని హత్య చేసేందుకు పథకం చేశారన్నారు. వివేకా హత్యలో పాల్గొన్నానని దస్తగిరి వాంగ్మూలం ఇస్తే అతన్ని ఇంతవరకు సీబీఐ అధికారులు అరెస్ట్ చెయ్యలేదని, హంతకుడిని సాక్షిగా మార్చమని సీబీఐ కోరుతోందని చెప్పారు. వివేక హత్యకు ఎర్రగంగిరెడ్డి మూలమని తెలిపారు. ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ మాత్రమే హత్య చేశారన్నారు. అవినాష్ ప్రమేయం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Advertisement
Advertisement