ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు Vijayasai మాస్టర్ ప్లాన్.. ఏం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2021-07-24T19:50:34+05:30 IST

ప్రత్యర్థులపై పగ సాధించుకునేందుకు, ప్రతిపక్షపార్టీలను నిర్వీర్యం చేసేందుకు వైసీపీ వాడుతున్న అస్త్రం అదేనా?...

ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు Vijayasai మాస్టర్ ప్లాన్.. ఏం జరుగుతుందో..!?

ప్రత్యర్థులపై పగ సాధించుకునేందుకు, ప్రతిపక్షపార్టీలను నిర్వీర్యం చేసేందుకు వైసీపీ వాడుతున్న అస్త్రం అదేనా? విశాఖలో మాస్టర్‌ ప్లాన్‌ వెనుకున్న రహస్యం ప్రజలకు తెలిసిందా? వైసీపీ ఫ్యాన్‌గాలికి ఎదురునిలిచి సైకిల్‌ను గెలిపించిన జనం  నమ్మకం వమ్ముకావడం వెనుకున్న మర్మం అదేనా? విశాఖ మాస్టర్‌ ప్లాన్‌ను వైసీపీ ఎంపీ విజయసాయి మాస్టర్‌ ప్లాన్‌ అని అక్కడి జనం, ప్రతిపక్షపార్టీలు గుసగుసగా మాట్లాడుకుంటున్నారా? అనే ఆసక్తికర, సంచలన విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


నలుగురు గెలిచి.. 

ఏపీలో వైసీపీ గాలిని తట్టుకుని తెలుగుదేశం నిలిచిన జిల్లా విశాఖపట్నం. 2019 సాధారణ ఎన్నికల్లో వైసిపి హవా రాష్టవ్యాప్తంగా కనబడినా, విశాఖ నగరంలో మాత్రం చతికిలపడింది. సిటీలో తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. విశాఖ ఉత్తరం నుంచి గంటా శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గం నుంచి వెలగపూడి రామకృష్ణబాబు, పశ్చిమ నియోజకవర్గం నుంచి గణబాబు, దక్షిణ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేష్‌ కుమార్ టిడిపి నుంచి గెలిచారు. దీంతో వైసీపీ  హైకమాండ్ కంగుతింది. ఎలాగైనా విశాఖలో పట్టు సాధించడానికి విజయసాయి రెడ్డిని అప్పటి నుంచే రంగంలోకి దించిందనేది రాజకీయాల్లో బహిరంగమైన రహస్యం.


విజయసాయి మాస్టర్‌ప్లాన్‌.. 

హైకమాండ్ ఆశలను వమ్ము చేయకుండా ఉండేందుకు విజయసాయి మాస్టర్‌ప్లాన్‌ వేశారట. టీడీపీని బలహీనపరిచేందుకు విశాఖ మాస్టర్‌ ప్లాన్‌ను వాడేస్తున్నారట. తొలుత టీడీపీ ఎమ్మెల్యేలను, సీనియర్ నేతలను పార్టీలోకి రమ్మని ఆహ్వానించారట.అయితే అప్పుడు టిడిపి నేతలు ఎవరూ రాలేమని చెప్పడంతో విజయసాయికి ఎక్కడలేని కోపం వచ్చిందని వైసిపి నేతలు చెబుతుంటారు. మాటవినని టిడిపి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ సీనియర్ నేతలు, ప్రజల్లో మంచి పట్టు ఉన్న నేతల వివరాలు, వారి ఆస్తులు, వారి బలహీనతల వివరాలన్నీ తెప్పించుకున్నారట. బలహీనతలను గుర్తు చేస్తూ పార్టీలోకి రావాలని వారికి బెదిరింపు  కబురు పెట్టారట.దీంతో వైసీపీ  ఒత్తిళ్లకు తట్టుకోలేక  విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌తో సహా విశాఖలో కొంతమంది టీడీపీ నేతలు అధికారపార్టీలోకి వెళ్లారనేది ప్రత్యర్ధుల ఆరోపణ.


బెదిరింపులతో ఫ్యాన్‌గాలి కిందకు సైకిల్‌ నేతలు 

విజయసాయి బెదిరింపు రాజకీయాలకు  భయపడి కొంతమంది ప్రతిపక్షనేతలు ప్యాన్‌గాలి కిందకు వచ్చారని వైసీపీ నేతలే గుసగుసలాడుతున్నారు. మరికొంతమంది అండర్‌స్టాండింగ్‌తో  పనిచేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.దీంతో  జీవీఎంసీ ఎన్నికల్లో  వైసీపీ విజయం సాధించి, మేయర్ పీఠాన్ని సునాయసంగా చేజిక్కించుకుందట.అయితే వైసిసి హైకమాండ్ ఇంతటితో ఆగలేదు.  వైసిపిలోకి రాలేమని తెగేసి చెప్పిన నేతలను టార్గెట్ చేస్తూ, వారి భవనాలను, నిర్మాణాలను అక్రమ కట్టడాలనే వంకతో  వీకెండ్‌లో కూల్చేవేసే కార్యక్రమాన్ని చేపట్టారట. దీంతో లోలోన జరుగుతున్న బెదిరింపు రాజకీయాలను జనాలకు చెబుతూ తెలుగుదేశం నేతలు ఎదురుతిరిగి బహిరంగ విమర్శలు చేస్తున్నారు.


తెలుగు తమ్ముళ్లను తొలుస్తున్న గంటా, గణబాబు సైలెన్స్‌ 

ఎమ్మెల్యే వెలగపూడి మాత్రం తమ పార్టీ టీడీపీ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు...ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబులా ఎందుకు యాక్టివ్‌గా ఉండడం లేదనేది తెలుగు తముళ్లను తొలుస్తున్న ప్రశ్న. టీడీపీ నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు వైసీపీ ఎంపీ విజయసాయి ప్రయోగించిన మంత్రదండం..విశాఖ మాస్టర్‌ ప్లానట. టీడీపీ నేతల ఆస్తులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు దెబ్బతీసేందుకు వారి భూముల నుంచి రోడ్లు వేసేలా, ఆస్తులు పోయేలా  మాస్టర్‌ప్లాన్‌ విజయసాయి డైరెక్షన్‌లోనే నడుస్తోందట.


ఎదురించేందుకు ప్రిపరేషన్..

ఆస్తులు పోతాయనే భయంతో వైసీపీలోకి వచ్చేందుకు ఒప్పుకున్న నేతల భూములను సేవ్‌ చేస్తామనే మాట ఇస్తున్నారట. దీంతో వీఎంఆర్డీఏను కాస్తా విజయసాయి మాస్టర్‌ప్లాన్‌ అనుకుంటున్నారట విశాఖవాసులు . ఈ ప్లాన్‌లో శుద్ధ తప్పులు ఉన్నందున అధికారులు సంతకాలు పెట్టలేదనే ప్రచారం జరుగుతోంది. ఫక్తు రాజకీయ ప్లాన్‌గా మారిన వీఎంఆర్డీఏలో ఇప్పటికే 500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రను దోచుకునేందుకు జరుగుతున్న కుట్రలను న్యాయస్థానాల్లో ఎదురించేందుకు తెలుగుదేశం నేతలు ప్రిపేర్‌ అవుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. 


ఓ అస్త్రంలో వాడుతోందా..!

రాజకీయ కుట్రకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన వీఎంఆర్డీఏపై ఆరోపణలు వస్తుండటంతో అభ్యంతరాలను జూలై 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు టాక్‌ వస్తోంది. వైసీపీ మాస్టర్‌ ప్లాన్‌ గురించి తెలుసుకుంటున్న జనం.. ఉత్తరాంధ్రను దోచుకునేందుకు విజయసాయిరెడ్డిని ఓ అస్త్రంలా వాడుకుంటుందనే ప్రచారం జరుగుతోందట.



Updated Date - 2021-07-24T19:50:34+05:30 IST