Abn logo
Aug 16 2021 @ 10:53AM

దళితులకు రావాల్సింది రూ.10లక్షలు కాదు...: Sharmila

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు. ద‌ళితుల‌కు రావాల్సింది రూ.10 ల‌క్షలు కాదు రూ.51 ల‌క్ష‌లు అని స్పష్టం చేశారు. ఏడేండ్ల కింద మూడెక‌రాల భూమి ఇస్తే ద‌ళితులు బాగుప‌డేవారన్నారు. రూ.51 ల‌క్ష‌లు ఇవ్వాల్సిన చోట రూ.10 ల‌క్ష‌ల‌తోనే కేసీఆర్ స‌రిపెట్టుకుంటున్నారని విమర్శించారు. మిగ‌తా రూ.41 ల‌క్ష‌లు కేసీఆర్ ముక్కుపిండి వ‌సూలు చేయాలని వైఎస్ షర్మిల అన్నారు. 

హైదరాబాద్మరిన్ని...

క్రైమ్ మరిన్ని...