Advertisement
Advertisement
Abn logo
Advertisement

చదివేస్తే ఉన్న మతిపోయినట్లుంది కేసీఆర్ పరిస్థితి: Sharmila

హైదరాబాద్: చదివేస్తే ఉన్న మతిపోయినట్లుంది కేసీఆర్ పరిస్థితి అని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీని అభివృద్ధి పథంలో తీసుకుపోయిన అని చెప్పుకునే దొర కేసీఆర్...సీఎం సీఎం పదవిలో ఉండి ఆర్టీసీని నష్టాలబారి నుంచి గట్టెక్కించడం మాత్రం చేతకావడం లేదని విమర్శించారు. ఇప్పుడు ఆర్టీసీని గాడిన పెట్టేందుకంటూ ఛార్జీల పెంపునకు తయారయ్యారన్నారు. ఇప్పటికే రెండు సార్లు ఛార్జీలు పెంచిన దొర, మూడో సారి పెంచేందుకు రెడీ అయ్యారని మండిపడ్డారు. ‘‘అయ్యా దొరగారు, ఎందుకు ఈ నష్టాల డ్రామా?...  రాజు తలుచుకొంటే దెబ్బలకు కొదవా?.. మీరు తలుచుకొంటే ఆర్టీసీ నష్టాలను పూడ్చడం కష్టమా’’? అని ప్రశ్నించారు. ఆర్టీసీని తమ అనుచరులకు అప్పగించేందుకు కేసీఆర్ డ్రామా ఆడుతున్నారని షర్మిల ఆరోపించారు. 

Advertisement
Advertisement