Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంకెంత మంది రైతులు చస్తే మీ కండ్లు చల్లబడతాయి?: Sharmila

హైదరాబాద్: వడ్లను రోడ్ల మీద, కల్లాల్లో పెట్టుకుని రైతులు నిరీక్షణ చేస్తున్నారని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ఎప్పుడుకొంటారో తెలియక కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతున్నాయన్నారు. యాసంగి వడ్ల మీద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ డ్రామాలకు ఇప్పటికే 10 మంది రైతుల గుండెలు ఆగిపోయాయన్నారు. ఇవాళ మరో ఇద్దరు..ఇంకెంత మంది రైతులు చస్తే తమ కండ్లు చల్లబడుతాయి కేసీఆర్ అని ప్రశ్నించారు. ఇంకెంత మందిని బలితీసుకొంటారని నిలదీశారు. రైతులను కోటీశ్వర్లను చేసామని, కార్లల్లో తిరుగుతున్నారని చెప్పుకోవడానికి సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. ఒక్కసారి ఫామ్ హౌస్ మత్తు నుంచి బయటికి వస్తే తెలుస్తుందని.. రైతులు కోటీశ్వరులు కావడం కాదు తమరు ఉరి కొయ్యకు ఉరి వేస్తున్నారని అన్నారు. తమరు పంట కొనక కాటికి పంపుతున్నారని వైఎస్ షర్మిల వ్యాఖ్యలు చేశారు. 

Advertisement
Advertisement