వివొ ఐపీఎల్ 2021 డిజిటల్ ప్రసార హక్కులు యప్ టీవీ సొంతం

ABN , First Publish Date - 2021-04-08T19:07:10+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ -ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్యాన్స్‌కి మరోసారి వినోదం

వివొ ఐపీఎల్ 2021 డిజిటల్ ప్రసార హక్కులు యప్ టీవీ సొంతం

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ -ఇండియన్ ప్రీమియర్ లీగ్  ఫ్యాన్స్‌కి మరోసారి వినోదం పంచేందుకు సిద్దం అయింది.  ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఏప్రిల్ 9న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సందడిగా ప్రారంభం కానుంది,  ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన నరేంద్ర మోడీ స్టేడియం  ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు వేదిక కావడం ఐపీఎల్ 2021కి మరింత ప్రాచుర్యం లభించింది. 


ఇందులో బాగంగా, ఓటీటీ మార్కెట్లో  ప్ర‌పంచ దిగ్గ‌జ‌మైన య‌ప్ టీవీ మరోసారి ఐపీఎల్ డిజిటల్  ప్రసార హక్కులు దక్కించుకుంది.  ఆస్ట్రేలియా, భూటాన్, యూరప్, దక్షిణ అమెరికా, మధ్య ఆసియా, శ్రీలంక, ఆగ్నేయాసియా (సింగపూర్, మలేసియా మినహా)నేపాల్ సహా అనేక దేశాల్లో వివో ఐపీఎల్ 2021ని యప్ టీవీలో ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించవచ్చు. దాదాపు వంద దేశాల్లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌ యప్ టీవీ ద్వారా ఐపీఎల్  మ్యాచ్‌లను వీక్షించవచ్చు.


యుప్ టివి వ్యవస్థాపకుడు మరియు సీఈఓ ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్‌కి అత్యంత ప్రజాధారణ ఉందని, కరోనా కారణంగా గత సంవత్సరం దుబాయిలో జరిగిన ఐపీఎల్ ఇప్పుడు భారతదేశానికి తిరిగి రావడంతో, క్రికెట్ ప్రేమికులు మరింత ఆసక్తిగా ఎదురుచుస్తున్నారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు వంద దేశాలలో ప్రసార హక్కులను యప్ టీవీ సొంతం చేస్కోవడంతో..మరెంతో మంది వీక్షకులు యప్ టీవి సబ్‌స్క్రిప్షన్‌‌ తీస్కోనున్నారని ఆయన అన్నారు.


వివొ ఐపీఎల్ 2021 గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి యప్ టీవి వెబ్ సైట్ లో చూడండి  :  https://www.yupptv.com/cricket

Updated Date - 2021-04-08T19:07:10+05:30 IST