యువీని సరైన సమయంలోనే తొలగించారు.. మాజీ సెలెక్టర్ వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2020-08-04T03:16:39+05:30 IST

భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను సరైన సమయంలోనే జట్టు నుంచి తొలగించారంటూ మాజీ సెలెక్టర్ రోజర్ బిన్నీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

యువీని సరైన సమయంలోనే తొలగించారు.. మాజీ సెలెక్టర్ వ్యాఖ్యలు!

న్యూఢిల్లీ: భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌ను సరైన సమయంలోనే జట్టు నుంచి తొలగించారంటూ మాజీ సెలెక్టర్ రోజర్ బిన్నీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల బీసీసీఐపై యువీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కెరీర్ చరమాంకంలో బీసీసీఐ ప్రవర్తన తనను తీవ్రమైన అసంతృప్తికి గురిచేసిందని చెప్పాడు. ఈ క్రమంలోనే రోజర్ బిన్నీ యువీ గురించి మాట్లాడాడు. ‘తనలో ఇంకా సత్తా ఉందని యువీ భావించి ఉండొచ్చు. కానీ అతను గతంలో ఆడినంత గొప్పగా కెరీర్ తుది దశలో ఆడలేకపోయాడు. ఇది వాస్తవం’ అని బిన్ని స్పష్టంచేశాడు. అందుకే అతన్ని జట్టు నుంచి తొలగించామని, అలా చేసేందుకు అదే మంచి తరుణమని చెప్పాడు.

Updated Date - 2020-08-04T03:16:39+05:30 IST