Advertisement
Advertisement
Abn logo
Advertisement

యువీ ఫౌండేషన్‌ వితరణ

న్యూఢిల్లీ: కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ముందుకు వచ్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా వెయ్యి పడకలను ఏర్పాటు చేస్తామని అతడి ఫౌండేషన్‌ యువీకెన్‌ ప్రకటించింది. వన్‌డిజిటల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌తో కూడిన ఈ బెడ్స్‌ను ఢిల్లీ ఎన్‌సీఆర్‌, హరియాణా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, కశ్మీర్‌ రాష్ట్రాల్లో పంపిణీ చేయనుంది.

Advertisement
Advertisement