Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్య మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది: వైవి సుబ్బారెడ్డి

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆర్థికమంత్రిగా ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబానికి సుబ్బారెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, అజాతశత్రువుగా పేరొందిన రాజకీయ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement