సున్నావడ్డీ, విద్యా దీవెన పథకాలపై సమీక్ష

ABN , First Publish Date - 2021-10-22T06:16:47+05:30 IST

ఈనెల 26న నిర్వహించే వైఎస్‌ఆర్‌ రైతు భరోసా రెండో విడత కింద రైతులకు సున్నా వడ్డీ రుణాల విడుదల, నవంబర్‌లో నిర్వహించే విద్యా దీవెన, ఇతర కార్యక్రమాలకు సంబంఽధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు.

సున్నావడ్డీ, విద్యా దీవెన పథకాలపై సమీక్ష
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, ఇతర అధికారులు

కాకినాడ సిటీ, అక్టోబరు 21: ఈనెల 26న నిర్వహించే వైఎస్‌ఆర్‌ రైతు భరోసా రెండో విడత కింద రైతులకు సున్నా వడ్డీ రుణాల విడుదల, నవంబర్‌లో నిర్వహించే విద్యా దీవెన, ఇతర కార్యక్రమాలకు సంబంఽధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాల యం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా స్థాయి అధికారు లతో ‘స్పందన’ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ హరికిరణ్‌, జాయింట్‌ కలెక్టర్లు జి.లక్ష్మీశ, చేకూరి కీర్తి, ఎ.భార్గవ్‌తేజ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. జాతీయ ఉపాధి హామీ పఽథకం, గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, డిజిటల్‌ లైబ్రరీలు తదితర శాశ్వత భవన నిర్మాణాల్లో పురోగతి, గ్రామ, వార్డు సచివాలయాల్లో కలెక్టర్లు, జేసీలు, సబ్‌ కలెక్టర్లు, ఆర్‌డీవోలు, మున్సిపల్‌ కమిషనర్ల తనిఖీలపై సీఎం జిల్లాల వారీ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డీఆర్‌వో సీహెచ్‌ సత్తిబాబు, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డ్వామా పీడీ ఏ వెం కటలక్ష్మి, డీఎంహెచ్‌వో కేవీఎస్‌ గౌరీశ్వరరావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ ఎం శ్రీనివాస్‌, జేడీ ఎన్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-22T06:16:47+05:30 IST