స‌మ‌ర్థంగా ధాన్యం సేకరణ

ABN , First Publish Date - 2021-04-21T05:42:04+05:30 IST

స‌మ‌ర్థంగా ధాన్యం సేకరణ

స‌మ‌ర్థంగా ధాన్యం సేకరణ

జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి 

 

కాటారం, ఏప్రిల్‌ 20 : రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి అన్నారు. , ధాన్యం సేకరణను సమర్థంగా చేపడతామన్నారు.  మార్కెట్‌ యార్డులో ఏఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్‌పర్సన్‌ అన్కారి భవాని ప్రకాశ్‌, ఎంపీటీసీలు తోట జనార్దన్‌, బాసాని రవి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ దబ్బెట స్వామితో కలిసి మంగళవారం ఆమె ప్రారంభించారు.  సఎం కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు.  రైతును రాజును చేయడమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేస్తున్నామని, రైతులు  దళారులకు అమ్ముకొని నష్టపోవద్దని అన్నారు. ఽకరోనా జాగ్రత్తలు పాటిస్తూ నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధరలు పొందాలన్నారు.  కార్యక్రమంలో ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ స్వామి, డైరెక్టర్లు సడువలి, సిరాజ్‌, గట్టయ్య, ఉప సర్పంచ్‌ నాయిని శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా నేత జక్కు రాకేష్‌, ఆర్‌ఎస్‌ ఎస్‌ మండల అధ్యక్షుడు రాజబాపు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు డోలి అర్జయ్య, నాయకులు భూపెల్లి రాజు, మందల లక్ష్మారెడ్డి, జోడు శ్రీనివాస్‌, అన్కారి ప్రకాశ్‌, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T05:42:04+05:30 IST