రోగ నిరోధకశక్తిని పెంచే జింక్‌!

ABN , First Publish Date - 2020-07-09T05:30:00+05:30 IST

కరోనాకు వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ సందర్భంలో కరోనా రాకుండా అడ్డుకోగల ఆహారం కోసం కూడా ఆసక్తి పెరిగింది...

రోగ నిరోధకశక్తిని పెంచే జింక్‌!

కరోనాకు వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా వైద్యులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.  ఈ సందర్భంలో కరోనా రాకుండా అడ్డుకోగల ఆహారం కోసం కూడా ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా జింక్‌ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు కరోనా ప్రభావాన్ని సమర్థవంతంగా అడ్డుకుంటాయి.


ఇన్ఫెక్షన్లను ఇలా అడ్డుకుంటుంది...

కణాల ఆరోగ్యం, మనుగడలో జింక్‌ సూక్ష్మపోషకం కీలక పాత్ర పోషిస్తుంది. కణాల పెరుగుదల, పనితీరు, రోగనిరోధక శక్తి పెరుగుదలకు జింక్‌ చాలా కీలకం. జింక్‌ తగ్గితే శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనమవుతుంది. రోగ నిరోధక శక్తిని క్రియాశీలం చేయటంతో పాటు, హానికర రసాయనాలను శరీరం నుంచి తొలగిస్తుంది. 


ఈ ఆహారంలో అధికం...

30 గ్రాముల సోయాబీన్‌లో 1.2 మిల్లీ గ్రాములు, తృణధాన్యాలలో 0.5 మిల్లీ గ్రాములు, కప్పు ఓట్స్‌లో 2.95 మిల్లీ గ్రాములు ఉడికించిన ముడిబియ్యంలో 1.38 మిల్లీ గ్రాములు, కాయధాన్యాలు, ముడి శెనగలు, బీన్స్‌, నల్లనువ్వులు, గుడ్డు, చికెన్‌, పుట్టగొడుగులు, పాల ఉత్పత్తుల్లో కూడా జింక్‌ అధికంగా లభిస్తుంది. 


Updated Date - 2020-07-09T05:30:00+05:30 IST