రూ. లక్ష కోట్లు దాటిన జొమాటో ఎం-క్యాప్

ABN , First Publish Date - 2021-07-23T20:25:57+05:30 IST

డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ షేర్లు ఈ రోజు(జూలై 23, శుక్రవారం) లిస్టింగ్ అయ్యాయి.

రూ. లక్ష కోట్లు దాటిన జొమాటో  ఎం-క్యాప్

హైదరాబాద్ : డెలివరీ సంస్థ జొమాటో లిమిటెడ్ షేర్లు ఈ రోజు(జూలై 23, శుక్రవారం) లిస్టింగ్ అయ్యాయి. వాస్తవానికి జొమాటో షేర్లు మంగళవారం నమోదు కావాల్సి ఉండగా, రెండు పనిదినాల ముందుకు జరపడం గమనార్హం. షేర్ల కేటాయింపు ప్రక్రియను సంస్థ గురువారమే పూర్తి చేయడమే ఇందుకు కారణం. రూపాయి ఫేస్ వ్యాల్యూ కలిగిన షేరును రూ. 75 ప్రీమియంతో రూ. 76 చొప్పున కంపెనీ కేటాయించింది. జొమాటో ఈక్విటీ షేర్లు శుక్రవారమే   నమోదయ్యాయి.


కాగా... గత శుక్రవారం అంటే 16 వ తేదీన జొమాటో ఐపీఓ ముగిసిన విషయం తెలిసిందే. నిరుడు మార్చి తర్వాత అధిక నిధులు సమీకరించిన ఐపీఓ ఇదే  కావడం గమనార్హం. దాఖలైన బిడ్ల విలువ రూ. 2.13 లక్షల కోట్లు కావడం గమనార్హం. కాగా పదకొండేళ్ళ తర్వాత ఏళ్ల మార్కెట్ చరిత్రలోనే ఇది అత్యధిక బిడ్ విలువ అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2021-07-23T20:25:57+05:30 IST