Abn logo
Sep 25 2021 @ 00:55AM

కొలువుదీరారు

ఖాజీపేట ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న అబూబకర్‌ సిద్దిఖ్‌

బాధ్యతలు చేపట్టిన మండల అధ్యక్షులు

ప్రశాంతంగా ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల ఎంపిక

పోటీ లేకుండానే ఎన్నికైన కో-ఆప్షన సభ్యులు

టీడీపీకే దక్కిన గోపవరం

కుదరని బేరం.. బెడిసికొట్టిన వైసీపీ వ్యూహం

(కడప-ఆంధ్రజ్యోతి): రెండేళ్ల ప్రత్యేక పాలనకు తెర పడింది. శుక్రవారం మండల పరిషత్తు నూతన పాలకవర్గం కొలువుదీరింది. మండల పరిషత్తు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో-ఆప్షన సభ్యుల ఎంపిక ఏకగ్రీవంగా.. ప్రశాంతంగా ముగియడంతో రాజకీయ పక్షాలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గోపవరం మండలంలో బేరం కుదరక అధికార పార్టీ వ్యూహం బెడిసికొట్టింది. జిల్లాలో టీడీపీ దక్కించుకున్న ఏకైక మండలం గోపవరం ఒక్కటే. రిటర్నింగ్‌ ఆఫీసర్లు ఉదయం 10 గంటలకు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలు, కో-ఆప్షన సభ్యుల ఎంపిక కోసం నోటిఫికేషన జారీ చేశారు. ఆ వెంటనే నామినేషన్లను స్వీకరించారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో మధ్యాహ్నం 12.00 గంటలకు అభ్యర్థుల జాబితా ప్రకటించారు. ఒంటి గంటకు కొత్తగా ఎంపికైన ఎంపీటీసీ సభ్యులతో రిటర్నింగ్‌ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత కో-ఆప్షన సభ్యులను ఎన్నుకున్నారు. షెడ్యూలు ప్రకారం సాయంత్రం 3.00 గంటలకు ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నిక జరిగింది. అన్ని మండలాల్లో సింగిల్‌ నామినేషన్లే రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజకీయ పరిణామాలు, కరోనా వైరస్‌ విజృంభణ, న్యాయస్థానాల్లో వివాదాల వల్ల రెండేళ్ల తరువాత మండల పరిషత్తు పాలకవర్గం బాధ్యతలు చేపట్టడంతో ప్రజాపాలన ప్రారంభం అయింది. జిల్లాలో 50 మండలాలు ఉంటే.. 49 మండలాల్లో అధికార పార్టీ వైసీపీయే దక్కించుకుంది.


గోపవరం టీడీపీకే పట్టం

జిల్లాలో గోపవరం మండల పరిషత్తు పీఠం టీడీపీనే దక్కించుకుంది. అధికార పార్టీ రాజకీయ ఎత్తులు, బేరసారాలు బెడికొట్టాయి. మెజార్టీ ఎంపీటీసీ సభ్యులను దక్కించుకున్న టీడీపీ ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పీఠాలను సొంతం చేసుకుంది. మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అందులో ఒక స్థానం వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. నాలుగు స్థానాలకు ఎన్నికలు జరిగితే మూడు ఎంపీటీసీలను టీడీపీ దక్కించుకుంది. ఆ ముగ్గురు సభ్యులను మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇనచార్జి విజయమ్మ రహస్య క్యాంపునకు తరలించారు. నాటి నుంచే టీడీపీ ఎంపీటీసీ కుటుంబ సభ్యులతో రాయబేరాలు సాగించారు. ఎత్తులకు పైఎత్తులు వేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు టీడీపీ సభ్యులు నేరుగా ఎంపీపీ సమావేశ భవనంలోకి చేరుకున్నారు. అక్కడ వారిని అడ్డుకోవడానికి వైసీపీ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. ఎంపీపీ పదవికి టీడీపీ అభ్యర్థి బ్రాహ్మణపల్లి ఎంపీటీసీ గోపిదేశి ధనలక్ష్మి, వైసీపీ అభ్యర్థిగా గోపవరం ఎంపీటీసీ సరస్వతి నామినేషన వేశారు. టీడీపీ సభ్యుల్లో ఒకరిని తనవైపు తిప్పుకోవడానికి చివరివరకు ప్రయత్నం చేశారు. ఫలించకపోవడంతో సమావేశం నుంచి ఆమె బయటికి వెళ్లిపోయారు. దీంతో ఎంపీపీగా ధనలక్ష్మి, వైస్‌ ఎంపీపీగా రామ్మోహనరెడ్డి ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి విజయకుమార్‌ ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. వారితో ప్రమాణస్వీకారం చేయించారు.


నేడు జడ్పీ చైర్మన, వైస్‌ చైర్మన్ల ఎంపిక

జిల్లా పరిషత చైర్మన, ఇద్దరు వైస్‌ చైర్మన్ల ఎంపిక, నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం కలెక్టరు విజయరామరాజు అధ్యక్షతన శనివారం జరగనుంది. ఈ మేరకు జడ్పీ సమావేశ భవనాన్ని తీర్చిదిద్దారు. 50 మంది జడ్పీటీసీ సభ్యులు ఉంటే.. వైసీపీ 49 స్థానాలను దక్కించుకుంది. ప్రతిపక్ష పార్టీ టీడీపీ గోపవరం జడ్పీటీసీ స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. రిజర్వేషన ప్రకారం ఎస్టీ మహిళ ఒకరు, ఎస్సీ సభ్యులు 9 మంది, బీసీ సభ్యులు 12 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జడ్పీ చైర్మన అభ్యర్థిగా రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డిని వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈయన ఎంపిక లాంఛనమే. వైఎస్‌ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. 2009లో రాజంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం జగన వైసీపీని స్థాపిస్తే కాంగ్రె్‌సకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన వెంట నడిచారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. 2014లో ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌ ఆయనకే దాదాపుగా ఖరారు అయినా.. చివరి క్షణంలో టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి వైసీపీలో చేరడంతో ఆకేపాటి ఎమ్మెల్యే టికెట్‌ కోల్పోయారు. ప్రతిఫలంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన హామీ ఇచ్చినా అవకాశం దొరకలేదు. దీంతో జడ్పీ చైర్మనగా ఎంపిక చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చైర్మన పదవి ఇవ్వడంతో రెండు వైస్‌ చైర్మన పదవులు నాన రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారని వైసీపీ ముఖ్య నాయకులు పేర్కొంటున్నా.. ఆ ఇద్దరి అభ్యర్థిత్వం ఇంకా ఖరారు చేయలేదు. శనివారం ఉదయంలోగా ఎంపిక చేస్తారని అంటున్నారు.