చింపాంజీతో అఫైర్.. జూకు రాకుండా మహిళపై నిషేధం!

ABN , First Publish Date - 2021-08-23T21:07:46+05:30 IST

జంతువులను మచ్చిక చేసుకోవడం, వాటితో ప్రేమగా మెలగడం సాధారణంగా అందరూ చేసేదే. జంతు ప్రేమికులు

చింపాంజీతో అఫైర్.. జూకు రాకుండా మహిళపై నిషేధం!

యాంట్‌వెర్ప్(బెల్జియం): జంతువులను మచ్చిక చేసుకోవడం, వాటితో ప్రేమగా మెలగడం సాధారణంగా అందరూ చేసేదే. జంతు ప్రేమికులు వాటితో మరింత సన్నిహితంగా గడుపుతారు. అయితే, ఈమె మాత్రం ఇంకొంచెం ముందుకు వెళ్లింది. ఏకంగా ఓ చింపాంజీతో ప్రేమాయణం నడిపింది. విషయం తెలిసిన జూ అధికారులు ఆమెను జూకు రాకుండా నిషేధించారు. బెల్జియంలోని పోర్ట్ సిటీ యాంట్‌వెర్ప్‌లో జూలో జరిగిందీ ఘటన. విషయం తెలిసిన జంతు ప్రేమికులు షాకయ్యారు. 


జూకు వస్తున్న ఆ మహిళ చింపాంజీతో ఎక్కువ సమయం గడుపుతున్నట్టు గుర్తించిన అధికారులు ఆమెను ఆరా తీశారు. అందుకామె చెప్పిన సమాధానం విని విస్తుపోయారు. చింపాంజీతో తాను ఎక్కువ సమయం గడుపుతున్న మాట నిజమేనని, దానితో తాను ‘అపైర్’ పెట్టుకోవడం వల్లే అంత సమయం గడుపుతున్నానని చెప్పడంతో అధికారులు నిర్ఘాంతపోయారు. 


ఎడీ టిమ్మెర్‌మాన్స్ అనే మహిళ ప్రతి వారం జూకు వచ్చి 38 ఏళ్ల చింపాంజీ చీతా వద్ద ఎక్కువ సమయం గడుపుతోంది. అద్దాల ఎన్‌క్లోజర్ నుంచి ఆమె చింపాంజీతో మాట్లాడడం, సైగలు చేయడం, ముద్దులు పెట్టడం చేస్తుండేది. నాలుగేళ్లుగా ఈ తంతు జరుగుతోంది. తాజాగా, వీరి వ్యవహారాన్ని గమనించిన జూ అధికారులు చింపాంజీ, మహిళ మధ్య స్నేహం మరింత పెరగడకుండా అడ్డుకోవాలని భావించి ఆమెను జూకు రాకుండా నిషేధించారు. 


తాను ఆ జంతువును ప్రేమిస్తున్నానని, అది కూడా తనను ప్రేమిస్తోందని, ఇంతకుమించి ఇంకేమీ లేదని ఎడీ పేర్కొంది. ఈ మాత్రానికే జూకు రాకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించింది. తమ మధ్య అఫైర్ ఉందని, అదే విషయాన్ని చెప్పానని తెలిపింది. అయితే, ఆమె అపైర్ కారణంగా చీతాకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని జూ అధికారులు చెబుతున్నారు. సందర్శకులతో చీతా బిజీగా ఉంటే ఇతర చింపాంజీలు దానిని క్రమంగా మరిచిపోయే ప్రమాదం ఉందని అన్నారు. కాగా, తనను జూకు రాకుండా నిషేధించడంపై ఎడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తనను అడ్డుకోవడం సరికాదని కన్నీరుపెట్టుకుంది. 

Updated Date - 2021-08-23T21:07:46+05:30 IST