జూమ్‌ ఫెటీగ్‌!

ABN , First Publish Date - 2021-04-20T05:30:00+05:30 IST

కొవిడ్‌ కాలంలో అధిక శాతం ఉద్యోగులు జూమ్‌ మీటింగ్‌లకు పరిమితం అవుతూ ఉన్నారు. అయితే ఇలాంటి నిరంతర మీటింగులతో కలిగే జూమ్‌ ఫెటీగ్‌ మగవారి కంటే ఆడవాళ్లకే ఎక్కువ!...

జూమ్‌ ఫెటీగ్‌!

కొవిడ్‌ కాలంలో అధిక శాతం ఉద్యోగులు జూమ్‌ మీటింగ్‌లకు పరిమితం అవుతూ ఉన్నారు. అయితే ఇలాంటి నిరంతర మీటింగులతో కలిగే జూమ్‌ ఫెటీగ్‌ మగవారి కంటే ఆడవాళ్లకే ఎక్కువ!


ఆన్‌లైన్‌ మీటింగులతో కలిగే అలసటకు జూమ్‌ ఫెటీగ్‌ అని పేరు. ఈ అలసట ప్రతి 20 మంది పురుషుల్లో ఒకరిని వేధిస్తూ ఉంటే, మహిళల విషయంలో ఆన్‌లైన్‌ కాల్స్‌తో ప్రతి ఏడుగురిలో ఒకరు అలసటకు లోనవుతూ ఉంటారని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు ఒక అధ్యయనంలో వెల్లడించారు. టెక్నాలజీ మైండ్‌ అండ్‌ బిహేవియర్‌ అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం, ‘జూమ్‌ ఎగ్జాషన్‌ అండ్‌ ఫెటీగ్‌ స్కేల్‌’ అనే ఓ మాధ్యమం ద్వారా పది వేల మందిపై ప్రయోగాలు నిర్వహించారు. ఇలా పురుషుల కంటే ఎక్కువగా మహిళలు జూమ్‌ కాల్స్‌ వల్ల అలసటకు లోనవడానికి కారణం సెల్ఫ్‌ ఫోకస్‌డ్‌ అటెన్షన్‌ అని సామాజిక మానసిక నిపుణులు చెబుతున్నారు. దీర్ఘ సమయాల పాటు సెల్ఫ్‌ ఫోకస్‌తో జూమ్‌ కాల్స్‌లో పాల్గొనడం ద్వారా ప్రతికూల భావోద్వేగాలు ఉత్పత్తై, మిర్రర్‌ యాంగ్జయిటీకి దారి తీస్తాయని వారంటున్నారు. అలాగే తగ్గిన శారీరక శ్రమ కూడా ఇందుకు మరొక కారణమనీ, సాధారణ మీటింగుల్లో పాల్గొన్నప్పుడు కదులుతూ, ఒళ్లు విరుచుకుంటూ శరీరానికి ఎంతో కొంత వ్యాయామం దక్కేదనీ, జూమ్‌ మీటింగుల్లో అలాంటి కదలికలకు తావు లేకపోవడం వల్ల అలసటకు లోనయ్యే అవకాశాలు పెరుగుతున్నాయనీ కూడా పరిశోధకులు అంటున్నారు. అలాగే పురుషులతో పోలిస్తే, మహిళలు మీటింగ్‌ జరిగే సమయాల్లో బ్రేక్‌లు తీసుకోకుండా నిరంతరంగా మీటింగ్‌ల్లో పల్గొనడం వల్ల కూడా వీరిలో అలసట పెరగడానికి మరో కారణమని పరిశోధకుల అభిప్రాయం.


Updated Date - 2021-04-20T05:30:00+05:30 IST