Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆత్మవిశ్వాసమే అసలైన ఆయుధం

జడ్పీ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా

 గుంటూరు(తూర్పు),  డిసెంబరు 3: ఆత్మవిశ్వామే అసలైన ఆయుధమని  జడ్పీ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతులు దినోత్సవాన్ని శుక్రవారం రెవెన్యూ కల్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు.  రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌ చైర్మన్‌ ముంతాజ్‌పఠాన్‌ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం దివ్యాంగులకు ప్రతినెల పింఛన్‌, అర్హులైన వారికి ఇళ్లస్థలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్‌, ఉండవల్లి శ్రీదేవిలు మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కృష్ణ, బలిజ పూసల సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలా భవాని, సాంఘిక సంక్షేమశాఖ డీడీ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.   


Advertisement
Advertisement