Abn logo
Sep 17 2021 @ 19:23PM

పశ్చిమ గోదావరి జిల్లాలో 19న జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్

పశ్చిమ గోదావరి: జిల్లాలోని 45 జడ్పీటీసీ స్థానాలకు, 781 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 19న కౌంటింగ్ జరుగుతుందని కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఏలూరు, జంగారెడ్డి గూడెం జడ్పీటీసీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. అభ్యర్థి మరణంతో పెనుగొండ జడ్పీటీసీ ఎన్నిక జరగలేదు. శనివారం, ఆదివారం రోజులను డ్రై డేగా అమలు పరుస్తున్నారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని కలెక్టర్  తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తామన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లకు కోవిడ్ పరీక్ష తప్పనిసరి అని కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption