Abn logo
Sep 18 2021 @ 22:42PM

పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం!

ఉదయగిరి : కౌంటిగ్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆర్డీవో చైత్రవర్షిణి

 కొవిడ్‌ నిబంధనలు పాటించాలి 

 ఎన్నికల అబ్జర్వర్‌ బసంత్‌కుమార్‌ 

ఆర్డీవోలు, ఆర్వోలు ఏర్పాట్ల పరిశీలన

కావలి, సెప్టెంబరు 18: కావలి, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ల పరిధి లో పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశారు. కావలి నియోజకవ ర్గంలోని కావలి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల్లో 4 జడ్పీటీసీలకు గాను అల్లూరు ఏకగ్రీవం కాగా 3 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగగా ఒక్కో మండలంలో ముగ్గురు వంతున 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కావలి మండలంలో 14 ఎంపీటీసీలకు గాను 5 ఏకగ్రీవం కాగా 10 ఎమ్పీ టీసీలకు 29 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బోగోలు మండలంలో 14 ఎమ్పీటీసీలకు 43 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దగదర్తి మండ లంలో 11 ఎమ్పీటీసీలకు 35 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అల్లూ రు మండలంలో 7 ఎమ్పీటీసీలకు ఒకటి ఏకగ్రీవం కాగా 6 ఎమ్పీటీసీలకు జరిగిన ఎన్నికలలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల లో పెద్దగా పోటీతత్త్వం కనిపించకపోవటంతో ఏకపక్షంగా ఎన్నికలు జరి గినా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నార్చు. ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకునితో పాటు అధికారులు పర్యవేక్షించారు. అన్ని కౌటింగ్‌ కేంద్రాల్లో కొవిడ్‌ నిబంధనలు అమలు జరిగేట్లు చూడాలని ఎన్నికల అబ్జర్వర్‌ బసంత్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం ఆయన కావలి విశ్వోదయ ఇంజనీరింగ్‌ కళాశాలలో కావలి నియోజకవర్గంలోని కావలి, బోగోలు, దగదర్తి, అల్లూ రు మండలాల జడ్పీటీసీ, ఎమ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. కావలి ఆర్డీవో శీనానాయక్‌తో కౌంటింగ్‌ ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఏర్పాట్లు పరిశీలించిన ఆర్డీవో చైత్రవర్షిణి

ఉదయగిరి/ఉదయగిరి రూరల్‌ : స్థానిక మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగే సీతారామపురం, వింజమూ రు, ఉదయగిరి మండలాల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను శనివారం ఆత్మకూ రు ఆర్డీవో చైత్రవర్షిణి పరిశీలించారు. ఆర్వోలు అరుణప్రసాద్‌, రమేష్‌బా బులు ఓట్ల లెక్కింపు సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఉదయగిరిలో 7 ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానానికి పది టేబుళ్ల, సీతారామపురం 3 ఎంపీటీ సీ స్థానాలకు మూడు టేబుళ్లు, వింజమూరు 12 ఎంపీటీసీ స్థానాలకు, జ డ్పీటీసీ స్థానానికి 12 టేబుళ్ల ద్వారా లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపు నకు సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లను సుమారు వంద మందిని నియమించా రు. జడ్పీటీసీకి ఆరుగురు, ఎంపీటీసీకి ఇద్దరు చొప్పున ఏజెంట్ల నియామ కానికి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు వీరాస్వామి, ఐజాక్‌ప్రవీణ్‌, తహసీల్దారు వెంకటసునీల్‌, ఈవోపీఆర్డీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అలాగే కౌంటింగ్‌కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ గిరిబాబు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఒక డీఎస్పీ, సీఐ, ఐదుగురు ఎస్‌ఐలు, ఏఎ్‌సఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లతోపాటు 55 మంది పోలీసులు, హోంగార్డులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే వింజమూరు, సీతారామపురరం, ఉదయగిరి పట్టణాల్లో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మద్యం షాపులు మూసివేస్తారన్నారు. 

వెబ్‌ కాస్టింగ్‌తో వీడియో రికార్డింగ్‌

ఆత్మకూరు : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని సీఐ వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నా రు. శనివారం ఆయన ఆత్మకూరు పట్టణంలో ఏర్పాటు చేసిన రెం డు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లును పరిశీలించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అనంతసాగరం, ఆత్మకూరు మండలాలకు, గిరిజన బాలుర వసతి గృహంలో ఏఎ్‌సపేట, చేజ ర్ల, కలువాయి, మర్రిపాడు మండలాలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఓట్ల లెక్కింపు జరుగు తుందన్నారు. ఈ కౌంటింగ్‌ కేంద్రాల వద్ద రెండంచల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విజయోత్సవాలకు అనుమతి లేదన్నారు. జెండాలు, లారీ లు, బాణాసంచాలకు అనుమతి లేదని, కౌంటింగ్‌ కేం ద్రాల వద్ద 30 పోలీసు యాక్ట్‌, 144 సెక్షన్‌ అమలులో, వెబ్‌ కాస్టింగ్‌తో వీడియో రికార్డింగ్‌ ఉంటుందని తెలిపారు.

కలిగిరిలో కావలి ఆర్డీవో శీనానాయక్‌

కలిగిరి : స్థానిక ఏపీ మోడల్‌స్కూల్‌లో ఆదివారం జరగనున్న పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేసినట్లు కావలి ఆర్డీవో శీనానాయక్‌ తెలిపారు. శనివారం ఆయన లెక్కింపు కేంద్రం వద్ద మాట్లాడుతూ కావలి డివిజన్‌ పరిధిలోని కలిగిరి, కొండా పురం, జలదంకి, దుత్తలూరు, వరికుంటపాడు మండలా లకు సంబంధించి లెక్కింపునకు ఏర్పాట్లు చేశామన్నా రు. తహసీల్దార్లు, రిటర్నింగ్‌ అధికారులు ఎంపీడీవో లు, స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్లు ఎవరి మండలాలకు సం బంధించి వారు పర్యవేక్షించాలన్నారు. కౌంటింగ్‌ హా ల్‌లోకి రిటర్నింగ్‌ అధికారిచే ధ్రువీకరించిన గుర్తిం పుకార్డు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలన్నా రు. ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, తహసీల్దారు పద్మావతి, పంచాయతీ కార్యదర్శి వెలుగోటి మధు పాల్గొన్నారు.

ఉదయగిరి రూరల్‌ : సిబ్బందికి సూచనలిస్తున్న సీఐ గిరిబాబు


కావలి : ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది


కలిగిరి : లెక్కింపు కేంద్రం వద్ద కావలి ఆర్డీవో శీనానాయక్‌