ఏపీ వ్యాప్తంగా 60.78 శాతం పోలింగ్

ABN , First Publish Date - 2021-04-09T03:39:44+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా 60.78 శాతం పోలింగ్ నమోదైందని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. అత్యధికంగా...

ఏపీ వ్యాప్తంగా 60.78 శాతం పోలింగ్

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 60.78 శాతం పోలింగ్ నమోదైందని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. అత్యధికంగా  ప.గో జిల్లా‌లో 68.27 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. విజయనగరం జిల్లాలో 67.13, విశాఖలో 6 5.25 శాతం, అతి తక్కువగా ప్రకాశం జిల్లాలో 51.68 శాతం పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు జిల్లాల్లో మూడు పోలింగ్ కేంద్రాల్లో శుక్రవారం రీ పోలింగ్ జరపాలని నిర్ణయించామన్నారు. విజయనగరం జిల్లాలో 1, నెల్లూరు -1, ప.గోజిల్లాలో 1 చోట రీ పోలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇరగవరం కేంద్రంలో శుక్రవారం రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో మూడు పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ జరుపుతున్నట్లు ప్రకటించారు. ‘‘బ్యాలెట్‌లో పోటీ చేస్తోన్న అభ్యర్థి పేరు స్థానంలో విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి పేరు రావడంతో రీపోలింగ్. నెల్లూరు జిల్లా ఎఎస్ పేట మండలం పొనుగుపాడు‌లో రీపోలింగ్. ఇక్కడ బ్యాలెట్ బాక్స్ బయటకు వెళ్లిపోవడంతో రీపోలింగ్. ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికల్లో పోలింగ్ తగ్గేందుకు వేర్వేరు కారణాలు ఉంటాయి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు కౌంటింగ్ పై నిర్ణయం తీసుకుంటాం. గుంటూరు జిల్లా ఉయ్యందలలో రిగ్గింగ్‌పై కలెక్టర్ నివేదిక అడిగాం. నివేదిక వచ్చాక రీపోలింగ్‌పై నిర్ణయం తీసుకుంటాం.’’ అని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-04-09T03:39:44+05:30 IST