ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లివే..

అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టులలో సింగపూర్ తొలి స్థానంలో ఉంది. దీని ద్వారా 195 దేశాలకు వీసా రహితంగా ప్రయాణం చేయవచ్చు.

జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ,  స్పెయిన్ దేశాల పాస్ పోర్టులు రెండో స్థానంలో నిలిచాయి. వాటి ద్వారా 192 దేశాలలో పర్యటించవచ్చు.

ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ దేశాల పాస్ పోర్టులు మూడో స్థానంలో నిలిచాయి. వీటి సాయంతో 191 దేశాలకు పర్యటించవచ్చు.

నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్, బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్  నాలుగో ర్యాంకులో ఉన్నాయి. ఈ పాస్ పోర్టులతో 190 దేశాలకు వెళ్లొచ్చు.

ఆస్ట్రేలియా, పోర్చుగల్ ఐదోస్థానంలో కొనసాగుతున్నాయి. వీటి పాస్ పోర్టులతో 189 దేశాల్లో పర్యటించొచ్చు.

గ్రీస్, పోలాండ్ దేశాలు ఆరో ర్యాంకులో ఉన్నాయి. వీటి పాస్ పోర్టులతొ 188 దేశాలకు వెళ్లవచ్చు.

కెనడా, చెకియా, హంగరీ, మాల్టా ఏడో స్థానంలో నిలిచాయి. వీటి పాస్ పోర్టులతో 187 దేశాల్లో వెళ్లవచ్చు.

యునైటెడ్ స్టేట్స్  ఎనిమిదో స్థానంలో ఉంది. దీని పాస్ పోర్టుతో 186 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు.

ఎస్టోనియా, లిథువేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తొమ్మిదో ర్యాంకులో ఉన్నాయి. వీటి పాస్ పోర్టులతో 185 దేశాల్లో పర్యటించవచ్చు.

ఐస్లాండ్, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా  తర్వాత స్థానాలలో నిలిచాయి. వీటి పాస్ పోర్టులతో 184 దేశాలకు వెళ్లవచ్చు.

భారత్‌కు 82వ ర్యాంక్ లభించింది. మన పాస్ పోర్టుతో ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్ సహా 58 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది.