స్టార్ ఉన్న 500 నోట్స్ నకిలివీ.. ఆర్బీఐ క్లారిటీ

మీ దగ్గర 500 రూపాయల నోట్స్ ఉన్నాయా అయితే ఓసారి చెక్ చేసుకోండి

ఆ నోట్లపై స్టార్ గుర్తు ఉంటే నకిలీవని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది

ఈ క్రమంలో అలాంటి నోట్స్ పనిచేస్తాయా లేదా అని పలువురు ఆందోళన చెందుతున్నారు

దీంతో ఆ స్టార్ ఉన్న 500 రూపాయల నోట్ల గురించి ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది

స్టార్ గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవి కావని ఆర్బీఐ స్పష్టం చేసింది

ఆ నోట్లు 2016 డిసెంబర్‌లో జారీ చేశారని, ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయన్నారు

నోటు వెనుక భాగంలో గవర్నర్ సంతకం, స్వచ్ఛత్ భారత్ లోగో, ప్రిఫిక్స్, నంబర్ మధ్య కాలీ ప్లేస్‌లో స్టార్ ఉంటుంది

ఇవి ఇతర నోట్లు అన్నీ ఒకటే, కానీ ఈ స్టార్ సింబల్స్ కొన్ని నోట్లకు మాత్రమే ఉంటుంది

పునర్ ముద్రించిన నోట్లను గుర్తించడానికి స్టార్ సింబల్ ఉంటుంది

దీని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఆర్బీఐ తెలిపింది