2030 నాటికి ఈవీ మార్కెట్ లో
సుమారు 5 కోట్ల ఉద్యోగాలు
లభిస్తాయని మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు
దేశీయ విద్యుత్ వాహన మార్కెట్ 2030 నాటికి రూ.20 లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉందని అయన అన్నారు
ఈవీ ఎక్స్‌పో 2024 లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు
రవాణా రంగం నుంచే 40% వాయు కాలుష్యం నమోదవుతోందని మంత్రి తెలిపారు
ప్రభుత్వం మొత్తం విద్యుత్‌లో 44% సౌర విద్యుత్ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు
జల విద్యుత్, సౌర విద్యుత్, హరిత విద్యుత్ అభివృద్ధికి ప్రాముఖ్యత ఇస్తున్నామన్నారు
విద్యుత్ వాహన తయారీ సంస్థలు నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ఆయన అన్నారు
మన దేశానికి లక్ష విద్యుత్ బస్సుల అవసరం ఉంటే, ప్రస్తుత సామర్థ్యం 50,000 మాత్రమేనని తెలిపారు
భారత వాహన పరిశ్రమ 2014లో రూ.7 లక్షల కోట్లుగా ఉందని, ప్రస్తుతం రూ.22 లక్షల కోట్లకు చేరిందని
జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో మూడో స్థానంలోకి చేరామని గడ్కరీ అన్నారు
Related Web Stories
50/30/20 బడ్జెట్ రూల్ పాటిస్తున్నారా లేదా
క్రిడిట్ స్కోర్ పెంచుకోవడం ఎలా.. టాప్ 10 టిప్స్
భారత్‌లో అత్యంత చవకైన విద్యుత్ కార్లు ఇవే!
ఆధార్‌లో మీ పేరు ఎన్ని సార్లు మార్చుకోవచ్చో తెలుసా