కార్లకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు.. కొన్ని రోజులే ఛాన్స్!

దేశంలో డీలర్ల వద్ద 7.8 లక్షలకు పైగా అమ్మకం కానీ కార్ల ఉన్నాయన్న ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్

ప్రపంచంలో మూడో అతిపెద్ద కార్ మార్కెట్‌కు ఇది ఆందోళన కలిగించే అంశమన్న ఎఫ్ఏడీఏ 

పండుగల సీజన్లు ఉన్నా తక్కువ సేల్ కావడంతో డీలర్ల నిల్వలు పెరిగి నష్టాలపాలవుతున్నారు

ప్రస్తుత నిల్వలు 70 నుంచి 75 రోజులకు చేరుకోగా, వాటి మొత్తం విలువ రూ. 77,800 కోట్లు

డీలర్ల స్టాక్ స్థాయి పెరగడంతో పలు కార్ల కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి

రూ.77,800 కోట్ల విలువైన 7,80,000 వాహనాల స్టాక్ 2 నెలల విక్రయాలకు సమానం

ఈ క్రమంలోనే అనేక కార్ల కంపెనీలు తమ వాహనాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి

టాటా మోటార్స్ సఫారీ, హారియర్, నెక్సాన్‌ వంటి మోడళ్లపై లక్షల రూపాయల తగ్గింపును అందిస్తోంది

హ్యుందాయ్ వెన్యూ, ఎక్సెటర్ వంటి మోడళ్లపై డిస్కౌంట్లను ప్రకటించింది

జీప్ ఇండియా తన గ్రాండ్ చెరోకీ మోడల్‌పై 12 లక్షల రూపాయల తగ్గింపును ఇస్తోంది