50/30/20 బడ్జెట్ రూల్ పాటిస్తున్నారా లేదా..

50/30/20 అనేది ఒక సమర్థవంతమైన పర్సనల్ ఫైనాన్స్ బడ్జెట్ సూత్రం

ఈ రూల్ ద్వారా మీ ఆదాయాన్ని 3 ప్రధాన భాగాలుగా విభజించవచ్చు

మీ ఆదాయంలో 50% మీ అవసరమైన వస్తువుల కోసం ఖర్చు చేయాలి

ఉదా: ఇంటి అద్దె, విద్య, బిల్లులు, ఆహారం, రవాణా, ఆరోగ్య సంరక్షణ

ఇంకో 30% మీ అలవాట్లు, ఆనందం కోసం ఖర్చు చేయాలి

(ఉదా: సినిమాలు, రెస్టారెంట్లు, ఫ్యాషన్ వంటివి)

మిగతా 20 శాతాన్ని పొదుపు, పెట్టుబడుల కోసం ఉంచుకోవాలి

రిటైర్మెంట్ సేవింగ్స్, ఎఫ్‌డీ, మ్యూచువల్ ఫండ్స్ వంటి పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి

ఈ సూత్రం అనుసరిస్తే మీ ఆర్థిక జీవితాన్ని అదుపులో ఉంచుకోవచ్చు

మీ లక్ష్యాలను సాధించడానికి, ఆర్థిక భద్రతను పెంచుకోవడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది